యేసుతో ఠీవిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోదము // యేసుతో // రారాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను (2) యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా (2) యేసుతో ఠీవిగాను వెడలను // యేసుతో // విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు (2) అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై (2) యేసుతో ఠీవిగాను వెడలను // యేసుతో // శోధనలు మనల చుట్టి వచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా (2) భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము (2) యేసుతో ఠీవిగాను వెడలను // యేసుతో // ఓ యువతి యువకులారా చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి (2) లోకమంత ఏకమై యేసునాథు గొల్వను (2) సాధనంబెవరు నీవు నేనెగా // యేసుతో //حول عيني لما الرب Werin Hezkirinê My do ojczystych śpieszym stron Ven Y Subamos A Sion Atmosphere Ради тебя اسبق الغضب jǔ qǐ fú yīn de dà qí Я и мой дом
Song not available - connect to internet to try again?