వినరే యో నరులారా-వీనుల కింపు మీర - మనల రక్షింప క్రీస్తు - మనుజావతారుఁడయ్యె - వినరే = అనుదినమున దే-వుని తనయుని పద-వనజంబులు మన-మున నిడికొనుచును // వినరే // నరరూపుఁ బూని ఘోర-నరకుల రారమ్మని-దురితముఁబాపు దొడ్డ - దొరయౌ మరియూ వరపుత్రుఁడు= కర మరు దగు క - ల్వరి గిరి దరి కరి-గి రయంబున ప్రభు-కరుణను గునరే // వినరే // ఆనందమైన మోక్ష - మందరి కియ్య దీక్షఁ - బూని తనమేని సిలువ - మ్రాను నణఁచి మృతిఁ బొందెను = దీన దయా పరుఁ - డైన మహాత్తుఁ డు-జానుగ - యాగము సలిపిన తెరంగిది // వినరే // పొందుఁగోరిన వారి - విందా పరమోపకారి - యెంద రెందరిఁ బరమా - నందపద మొందఁగఁజేసెను = అందమునన్ దన-బొంది సురక్తము - జిందెను భక్తుల - డెందము గుందఁగ // వినరే // ఇలా మాయావాదుల మాని - యితఁడే సద్గురుడని - తలపోసి చూచి మతి - ని-శ్చల భక్తిని గొలిచిన వారికి = నిల జనులకు గలు-ముల నలరెడు ధని-కుల కందని సుఖ-ములు మరి యొసఁగును // వినరే //Baht'ra yang Dipandu Yesus مشتاقلك เปรียบดังสายธาร Шукр бар Ту Кто бы дал мне орлиные крылья Veniţi să cântăm laudă lui Isus أؤمن بدم يسوع المسيح غالي على قلبك You are God alone لما باشتم قلبي بيحزن
Song not available - connect to internet to try again?