అంకితం ప్రభూ నా జీవితం - నీ చరణాల సేవకే అంకితమయ్యా (2) నీ సేవకై ఈ సమర్పణా - అంగీకరించుము నాదు రక్షకా (2) మోడుబారిన నా జీవితం - చిగురింపజేసావు దేవా నిష్ఫలమైన నా జీవితం - ఫలియింపజేసావు ప్రభువా నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు (2) అంగీకరించుము నా సమర్పణ // అంకితం // కారు చీకటి కాఠిన్య కడలిలో - నీ కాంతినిచ్చావు దేవా చీకటిలోనున్న నా జీవితం - చిరుదివ్వెగా చేసావు ప్రభువా నీ సన్నిధిలో ప్రకాశించుటకు అంధకార ఛాయలను తొలగించుటకు (2) అంగీకరించుము నా సమర్పణ // అంకితం //kẖlyny tẖạbt ربي في حضنك روحي تستريح تهدأ Дотянусь So groß ist der Herr Много дорог есть на свете друзья Mňa hriechu moc už neviaže 天父我有一个很深的期待 Мукаддес Китабы ока Ҳамд гӯям Раббро, эй мардумон Požehnán buď Hospodin
Song not available - connect to internet to try again?