కృతజ్ఞతన్ తలవంచి నాదు జీవము అర్పింతును లేదే ఇక-నే ఈవి ఇల అర్పింతును నన్నే నీకు (2) దూరమైతి నీ ప్రేమ మరచి నే రేపితి నీ గాయముల్ (2) దూరముగా నిక వెళ్ళజాల కూర్చుండెద నీ చెంతనే (2) // కృతజ్ఞతన్ // ఆకర్షించే లోకాశాలన్ని లోక మహిమ నడ్డగించు (2) కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై నిక్కముగా త్యజింతును (2) // కృతజ్ఞతన్ // తరముల నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము (2) నిరంతరము సేవించినను తీర్చలేను నీ ఋణము (2) // కృతజ్ఞతన్ //قومي يا مصر واستنيري إرفع عينيك لفوق Ya Ubangiji Mun Gode, Don Ka Sake Tada Mu พลังแห่งความรอด Мадҳ этинглар 주의 사랑 주의 능력 Ерусалiм Rab Geldi Dünyamıza O Ježíšově lásce ننتظر قوتك
Song not available - connect to internet to try again?