క్షణమైన నీవు నను విడచి పోలేదుగా కనురెప్ప పాటైనా నను మరచి పోలేదుగా (2) కునుకక నిదురించక కనుపాపలా నను కాచియుంటివి (2) // క్షణమైన // పర్వతములు అన్ని తొలగిపోయినా నాదు మెట్టలన్ని చెదరిపోయినా (2) నా వెన్నంటి నా తట్టు నిలచి కన్నీటినంతా తొలగించితివి (2) నీ కృప నను విడిచిపోలేదు నీ సన్నిధి నాకు దూరపరచలేదు (2) // క్షణమైన // శోధనలు నన్ను చుట్టుముట్టినా శ్రమలే నన్ను కృంగదీసినా (2) నా తండ్రివై నా తోడుగా నిలచి నా భారములన్ని తొలగించితివే (2) నీ కృప నను విడిచిపోలేదు నీ సన్నిధి నాకు దూరపరచలేదు (2) // క్షణమైన //yé sū de míng dà yǒu quán bǐng என்னை நடத்திடும் தேவன் калканъмъз куветимиз Nu există frică în iubire إنني ربي عارف ذنبي ạ̉mạ ạ̉nạ fbktẖrẗ ОТЧЕ, МОЙ ОТЧЕ تشتاق نفسي Ак булуттай аппак кийгени ىيىق رۇحۇڭدۇ مول تۅگۉپ
Song not available - connect to internet to try again?