త్రాహి మాం క్రీస్తు నాధ-దయఁజూడ రావే = నేను-దేహి యనుచు నీ పాదములే - దిక్కుగాఁ జేరితి నిపుడు // త్రాహి // 1గవ్వ చేయరాని చెడ్డ - కర్మేంద్రియాధీనుఁడనై - రవ్వపాలై నే నెంతో - నెవ్వ ఁబొందితిఁ - త్రవ్వుచున్న కొలఁదిఁ - పెరుఁగుఁ- దరగదు నా పాప రాశి - యివ్విధమునఁ జెడిపోతినినే - నేమి సేతు నో¬¬¬ // త్రాహి // నీ యందు భయభక్తులు లేని - నిర్లజ్జాచిత్తముఁ బూని - చేయరాని దుష్కర్మములు చేసినాఁడను = దయ్యాలరాజు చేతిలో ఁ - జేయి వేసి వాని పనులఁ- జేయ సాగి నే నిబ్భంగిఁ - జెడిపపోయితి నే నయ్యయ్యయ్యొ // త్రాహి // నిబ్బర మొక్కంచుకైన-నిజము రవ్వంతైన లేక- దబ్బర లాడుటకు ము-త్తాత నైతిని= అబ్బురమైన ఘోర పా -పాంధకార కూపమందు - దబ్బున బడిపోయినయ్యో - దారి చెడి నేనబ్బబ్బబ్బా // త్రాహి //Сұраңдар Istenvágy أمي الحنونه Не бойся умереть Боятся разве зерна Свят, свят, свят Господь! ادخل لقدسك اترجى وجهك Փառավոր ենք ստեղծված Oh, Gesù grazie Som biedny, Pane, pred Tebou Бърак Ясън
Song not available - connect to internet to try again?