నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెద // నజరేయుడా // ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2) శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్య (2) నీకే వందనం నీకే వందనం (2) // నజరేయుడా // అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2) జలములలోబడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా (2) నీకే వందనం నీకే వందనం (2) // నజరేయుడా // సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2) సీయోనులో నిను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2) నీకే వందనం నీకే వందనం (2) // నజరేయుడా //Калбин Капалъ Мъ? Солнце над Гаваоном Сең үчин дүнйә гелен 不变的守候 Se duce viaţa ca un vis kmạ ạ̉nạ wlys ly ʿdẖr Môj Pán, môj Boh Net soos jy is O Zbawicielu drogi YA RAB AKLIMDA SEN VARSIN
Song not available - connect to internet to try again?