నడిపించు చున్నాడు - నజరేయుడు నడక నేర్పుచున్నాడు - నను విడువని దేవుడు గాఢాంధకారములైనా - కన్నీటి లోయలైనా కష్టాల తీరములైన - కఠినమైన మార్గములైనా // నడి // నా కాళ్ళు తడబడగా - నడువ లేక నిలబడగా (2) అడుగులో అడుగేసి - చేతిలో చెయ్యేసి (2) ఊసుచెప్పినాడు - బాసచేసినాడు (2) ఆదరించే దేవుడు నా యేసయ్యా ఆశీర్వదించే దేవుడు నా యేసయ్య // సడి // ముదిమిలో బలముడిగి - నిలువలేక తూలిపోగా (2) చంకలో ఎత్తుకొని - ముద్దులతో ముంచెత్తి (2) ప్రేమ చూపినాడు - ప్రాణమిచ్చినాడు (2) ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా // స //Есүс уруу би очвол hlm nhd sbḥnạ Andaikan Surya Pagi Tersembunyi Rab'be övgüler sun 阿爸在家里等着我 Reste avec nous Śpiewać chcę Bénissez l'Eternel 我们的名字不再叫雅各 A szeretet nem fogy el sosem
Song not available - connect to internet to try again?