నమ్మకమైన నా స్నేహితుడు నా ప్రభు యేసుడు (2) ఎడబాయనివాడు విడువనివాడు (2) నిన్న నేడు ఒకటిగనున్నవాడు // నమ్మకమైన // ఆపదలో ఆనందములో నను వీడనివాడు (2) వ్యాధిలో భాధలో (2) నను స్వస్థపరచువాడు అనుక్షణం నా ప్రక్కన నిలచి ప్రతిక్షణం నా ప్రాణం కాచి (2) అన్నివేళలా నన్నాదరించువాడు (2) నా ప్రియ స్నేహితుడు నా ప్రాణహితుడు (2) // నమ్మకమైన // కలిమిలో లేమిలో నను కరుణించువాడు (2) కలతలలో కన్నీళ్ళలో (2) నను ఓదార్చువాడు కన్నతల్లిని మించిన ప్రేమతో అరచేతిలో నను దాచినవాడు (2) ఎన్నడు నన్ను మరువనివాడు (2) నా ప్రియ స్నేహితుడు నా ప్రాణ హితుడు (2) // నమ్మకమైన //بحر محبة الفادي Láska svätá, počuj ma Гэрэл туяа Ne zor inandın sen bana KHRIHFABU PUMHNAK HRAM Үлви دايماً بتخبيني Желая много, Отче мой Раб'би Йуджелтелим Твърдо за Христа стоиме
Song not available - connect to internet to try again?