నాతో మాట్లాడుమయ్యా - నన్నూ దర్శించుమయ్యా నీ మందిరాన - నీ సన్నిధాన - నీ ఆత్మతో నన్ను - నింపుమయా యేసయ్యా .... ఆ.. ఆ.. యేసయ్యా .. ఆ..ఆ.. యేసయ్యా... ఆ ఆ..యేసయ్యా .... యేసయ్యా.... కన్నీళ్ళైనా కష్టాలెదురైనా - కడవరకు నను చేర్చుమయ్యా కరువు తోడైనా - కలిమి వేరైనా - కరుణించి కాపాడుమయ్యా నా వేదనలో నీ జాలితో - నా శోధనలో నీ చేతితో నిత్యము నను నడిపించుమయ్యా .... // యేసయ్యా // నావారే నన్ను నిందించేవేళ - నను విడచి పోబోకుమయ్యా ఆదరణ నాకు కరువైనవేళ - దరిచేర్చి ఓదార్చుమయ్యా నా నిందలలో నా తోడువై - అపనిందలలో నా చేరువై నిత్యము నను నడిపించుమయ్యా .... // యేసయ్యా // నా కాలు జారి తొట్రిల్లువేళ - చేజాచి నిలబెట్టుమయ్యా సాతాను నన్ను బంధించేవేళ - నను చేరి విడిపించుమయ్యా నీ చెతితో నను పట్టుకో - నీ సేవలో నను వాడుకో నిత్యము నను నడిపించుమయ్యా .... // యేసయ్యా //Севинин кардашлар, хер заман севинин ! Иисус любит деточек О'на Йине ЬОвгюлер Олсун bṣlạty ạ̉nạdyk Держи в Своей ладони меня Benim Isam ạlftrẗ ạltẖạltẖẗ - Onething 2010 هذه هي وصيتي Chaque matin je répète الرب عال
Song not available - connect to internet to try again?