ప్రేమసాగరా! ఈ ధరమరణ ఎడారిలోన దారి తప్పితిన్ నీ మధరు స్వరము వినబడి నీ దరికి చేరితిన్ - దరికి చేరితిన్ శతృవైన సాతాను యుక్తిలోన పడితినాయ్య (2) ముక్తిదాత యేసుక్రీస్తు శక్తినన్ తప్పించెనయ్యా // ప్రేమ // చేయరాని పనులు చేసి గాయపరచినాను నిన్ను (2) చేయకుండా కాని పనులు కాయుమయ్య కరుణజూపి // ప్రేమ // కన్నతండ్రి ప్రేమ యెరుగకున్న పామరుండనయ్యా (2) అన్న యేసు సిలువ నాదు కన్నులు వెలిగించెనయ్యా // ప్రేమ // గుండెలదిరి పోయెనాకు కొండమీద ప్రియునిగాంచి (2) చిందెయేసు రుధిరము నా బండవంటి హృదయం కరుగ // ప్రేమ // కాలమెల్ల గడిచిపోయె చాలునింక లోక బ్రతుకు (2) మేలుకొలుపు కలిగె నీదు జాలి గొలుపు పిలుపు వినగ // ప్రేమ //Әр жаңа күнде يسوع الشافى Дай Мне твоё измученное сердце Choć na naszej drodze Тоолору бийик, көгүлтүр асман Give me oil Ҹеннетин гаписи Jubilosos Te Adoramos Náš Pán, On je kráľov Kráľ Rab'bimiz Doğdu Dünya'da
Song not available - connect to internet to try again?