భజన చేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామమును (2) వృజినములపై జయము నిచ్చిన (2) విజయుడా నిను వేడుకొందు // భజన // దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు (2) భవ్యమైన బోధలెన్నో (2) బాగుగా ధర నేర్పినావు // భజన // నరుల గావను పరమునుండి ధరకు నీవు వచ్చినావు (2) పరుడ నైన నా కొరకు నీ (2) ప్రాణము నర్పించినావు // భజన // చెడినవాడ నైన నన్ను జేరదీసి ప్రోచినావు (2) పడిన నాడు గోతి నుండి (2) పైకి లేవనెత్తి నావు // భజన // ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్య నీకు (2) ఇంతయని వర్ణింప నిలలో (2) నెవనికిని సాధ్యంబు కాదు // భజన //Raina Na Ba da Shi, Na Ba da Jinina يسوع أنت رفيقي Буюк ном Posso farcela nnsẖd lḥnạ jdydạaⁿ وحدك حبيبي 当春天回到大地的时候 Хабар чун барқ медавад وا حبيبي وا حبيبي Love is War
Song not available - connect to internet to try again?