మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా అ.ప.:నా మది నీ కోవెలగా మలచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము మనసు మర్మమెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజదేవుడా చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను అంతరంగమును పరిశీలించు యేసయ్యా స్థిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి దీనమనస్సుతో నీకడ శిరము వంచితి పూర్ణశాంతిగల వానిగా నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమాرفضوك ạ̉ṭrḥ ạ̉kạlyly لاسمك القدوس نهدي N-are nimeni ocrotire قراءة 2 - ليكن نور Golgotské víťazstvo sẖạylk fy qlby ᠤᠢ ᠭᠠᠰᠢᠭᠤ ᠶᠢᠨ ᠬᠦᠮᠦᠨ Dari III Track 10 KA SI BANGIN
Song not available - connect to internet to try again?