రండి సువార్త సునాదముతో - రంజిలు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో - ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే మానవ జాతి వికాసం - యేసే మానవ జాతి విలాసం - యేసే పతిత పావన నామం - భాసుల క్రైస్తవ శుభనామం // రండి // యేసే దేవుని ప్రేమ స్వరూపం - యేసే సర్వేశ్వర ప్రతిరూపం యేసు ప్రజాపతి పరమేశం - ఆశ్రిత జనముల సుఖవాసం // రండి // యేసే సిలువను మోసిన దైవం - యేసే ఆత్మల శాశ్వత జీవం యేసే క్షమాపన అధికారం - దాసుల ప్రార్ధన సహకారం // రండి // యేసే సంఘములో మన శాంతి - యేసే హృదయములో ఘనశాంతి - యేసే కుటుంబ జీవన జ్యోతి - పసిపాపల దీవెన మూర్తి // రండి // యేసే జీవన ముక్తికి మార్గం - యేసే భక్తుల భూతల స్వర్గం యేసే ప్రపంచ శాంతికి సూత్రం - వాసిగ నమ్మిన జనస్తోత్రం // రండి //Our God He Reigns خدني الى حضرتك Долдур иджими тазеле бени Bo Ruach Elohim yhwh yswʿ rbnạ qlby ạ̹nt kẖạyf lyh EY Göklerdeki Olan, Yüce Babamız Pe inima lui Isus О'ну излейейим Daniele
Song not available - connect to internet to try again?