వినవా మనవి యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా మలినము నా గతం - పగిలెను జీవితం చేసుకో నీ వశం // వినవా // లోక స్నేహమే కోరి దూరమైతిని వీడిపోయి నీ దారి ఓడిపోతిని విరిగిన మనసుతో నిన్ను చేరాను చితికిన బ్రతుకులో బాగు కోరాను నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా నా తండ్రి నీవేనయ్యా // వినవా // ఆశ ఏది కానరాక బేలనైతిని బాధలింక పడలేక సోలిపోతిని అలసిన కనులతో నిన్ను చూసాను చెదరిన కలలతో కృంగిపోయాను నన్ను సేదదీర్చి సంతోషించని యేసయ్యా నా దైవము నీవయ్యా // వినవా //ạlly ṣạnʿny hw rgẖm ḍyạʿ ạlḥb Bénissez l'Eternel Миний гэр үзэсгэлэнтэй гэр (Өвөрмонгол магтаал) Spievajte si .. Mnie do Nieba dążyć trzeba Adeseori cărarea mea bạhr ạlsnạʾ wǒ men shì yī zhī wú xíng de jūn lǚ ساعدنى اعيش
Song not available - connect to internet to try again?