స్తోత్రము సేయరే - సోదరులారా మనాత్మలతో తండ్రిన్ ధాత్రిని మన పర-మాత్ముని వాక్కులు స్తోత్రములో గలిపి మరల విచటం గూ-డుదమో లేదో-మనమందర మింకను త్వరలో మన పరలోకపు తండ్రి తోడనుందు మేమో ఇచ్చట ప్రేమల కిదియే కడవరి - వచ్చియున్నదేమో యచ్చట మనమందరము గలిసికొని - యానందింతుముగా ఎక్కువ ప్రేమలు - చక్కని స్తోత్రము- లక్కడ మనమంత మిక్కిలి ప్రియుండగు దేవుని కిడుదు - మొక్క మనసుతోను కన్నీరుండదు - చావు కష్టము - లెన్నిటి కండవుగా పన్నుగ మన శృం-గారపు బ్రతుకు - లెన్న కండవుగా మ్రోగును వీణెలు - సాగును పాటులు- సతతముగా నచట రాగము లెంతో రమ్మమైన యుండన్ - బాగింతనలేము గొఱ్ఱెపిల్ల రక్తము - విలువచ్చట - గొప్పది అందుముగా గరుతరమగు మన దేవుని ప్రేమను - కూర్మితో జూతుముగాСмоковница Înc-un an s-a scurs acum Кутсал Олан Yo Rabbim, men Senga keldim lyl ạlʿsẖạʾ ạlsry Иса Патша هيكون أحلى بيت Io ti amo Kau, Allah, Benteng yang Baka Алəмə јајылды бу илкин хəбəр
Song not available - connect to internet to try again?