ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2) నా పాపము బాప నరరూపివైనావు నా శాపము మాప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే (2) // ఎందుకో // నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోనే నివసించుమన్నావు నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో (2) // ఎందుకో // నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు (2) // ఎందుకో // నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీ సంపద నాలో నా సర్వస్వము నీలో నీవు నేను ఏకమగువరకు నన్ను విడువనంటివే (2) // ఎందుకో // నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్ (2) // ఎందుకో //علمني إنجيلك ḥyn ạ̉ry̱ ṣlyb Zilele trec ca şi gândul بتحس بى أنا مستنيك zàn měi zhǔ ràng guāng zhào yào ba Davanti al tuo altare Сен Унутмагин Erta tongda quyosh turar Allahnmu Garu Mai Ƙarfi
Song not available - connect to internet to try again?