ప్రభు యేసుని వదనములో - నా దేవుడు కనిపించె (2) పాపాత్ముల బ్రోచుటకై - కృపలొలికిన కలువరిలో (2) పరలోకముకై - చిర జీవముకై (2) ప్రార్ధించెను నా హృదయం // ప్రభు యేసుని // దిశలన్నియు తిరిగితిని - నా పాపపు దాహముతో (2) దౌష్ట్యములో మసలుచును - దౌర్జన్యము చేయుచును (2) ధన పీడనతో - మృగ వాంఛలతో (2) దిగాజారితి చావునకు // ప్రభు యేసుని // యేసు నీ రాజ్యములో - భువి కేతెంచెడి రోజు (2) ఈ పాపిని క్షమియించి - జ్ఞాపకముతో బ్రోవుమని (2) ఇల వేడితిని - విలపించుచును (2) ఈడేరెను నా వినతి // ప్రభు యేసుని // పరదైసున ఈ దినమే - నా ఆనందములోను (2) పాల్గొందువు నీవనుచు - వాగ్ధానము చేయగనే (2) పరలోకమే నా - తుది ఊపిరిగా (2) పయనించితి ప్రభు కడకు // ప్రభు యేసుని //bʿd mạ knt ʿbd ạ̉jyr Salmo 100 Met my hart Sopra il mare Երկրպագում եմ rby ạ̉nt ṭryqy Doen slegs U wil Heer qwẗ ḥḍwrk The Table สุขใจในพระคริสต์
Song not available - connect to internet to try again?