వినవా మనవి యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా మలినము నా గతం - పగిలెను జీవితం చేసుకో నీ వశం // వినవా // లోక స్నేహమే కోరి దూరమైతిని వీడిపోయి నీ దారి ఓడిపోతిని విరిగిన మనసుతో నిన్ను చేరాను చితికిన బ్రతుకులో బాగు కోరాను నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా నా తండ్రి నీవేనయ్యా // వినవా // ఆశ ఏది కానరాక బేలనైతిని బాధలింక పడలేక సోలిపోతిని అలసిన కనులతో నిన్ను చూసాను చెదరిన కలలతో కృంగిపోయాను నన్ను సేదదీర్చి సంతోషించని యేసయ్యా నా దైవము నీవయ్యా // వినవా //Мама моя Uram, irgalmazz كنت فاكر Крик Духа Святого يسوع المسيح الألف والياء Hallelujah in my hart Ивээгээрэй Serca razem połączone How Majestic is Your Name Seul refuge de mon âme
Song not available - connect to internet to try again?