కన్నీరేలమ్మా... కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా... కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కరుణ చూపి కలత మాన్పె (2) యేసే తోడమ్మా // కన్నీరేలమ్మా // నీకేమీ లేదని ఏమీ తేలేదని అన్నారా నిన్ను అవమాన పరిచారా తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా చింతించకన్న యేసు మాటలు మరిచావా మారాను మధురంగా మార్చెను చూసావా (2) // కన్నీరేలమ్మా // నీకెవరూ లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా పొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా నేనున్నానన్న యేసు మాటలు మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా (2) // కన్నీరేలమ్మా //Bože, od Teba všetko máme Ով է, Որ Տեսնում է Por mí en la cruenta cruz Hálát adok, hogy itt a reggel V kamennom hrobe spal lmạ bạsẖtm qlby byḥzn ยังสุดปลายแห่งแผ่นดิน تلج تلج Ыбрайымдын Кудайы биз үчүн кан төккөн O gündən ki
Song not available - connect to internet to try again?