జయ జయ యేసు - జయ యేసు జయ జయ క్రీస్తు - జయ క్రీస్తు (2) జయ జయ రాజా - జయ రాజా (2) జయ జయ స్తోత్రం - జయ స్తోత్రం // జయ జయ // మరణము గెల్చిన జయ యేసు - మరణము ఓడెను జయ క్రీస్తు (2) పరమ బలమోసగు జయ యేసు (2) శరణము నీవే జయ యేసు // జయ జయ // సమాధి గెల్చిన జయ యేసు - సమాధి ఓడెను జయ క్రీస్తు (2) సమరము గెల్చిన జయ యేసు (2) అమరముర్తివి జయ యేసు // జయ జయ // సాతాన్ను గెల్చిన జయ యేసు - సాతాను ఓడెను జయ క్రీస్తు (2) పాతవి గతియించే జయ యేసు (2) దాతవు నీవే జయ యేసు // జయ జయ // బండను గెల్చిన జయ యేసు - బండయు ఓడెను జయ క్రీస్తు (2) బండలు తీయుము జయ యేసు (2) అండకు చేర్చుము జయ యేసు // జయ జయ // ముద్రను గెల్చిన జయ యేసు - ముద్రయు ఓడెను జయ క్రీస్తు (2) ముద్రలు తీయుము జయ యేసు (2) ముద్రించుము నను జయ యేసు // జయ జయ // కావలి గెల్చిన జయ యేసు - కావలి ఓడెను జయ క్రీస్తు (2) సేవలో బలము జయ యేసు (2) జీవము నీవే జయ యేసు // జయ జయ // దయ్యాలు గెల్చిన జయ యేసు - దయ్యాలు ఓడెను జయ క్రీస్తు (2) కయ్యము గెల్చిన జయ యేసు (2) అయ్యా నీవే జయ యేసు // జయ జయ //Бурганга айтырыым Come, my soul, thy suit prepare /Take My Life and Let It Be Shukurlar aytib Senga charchamayman Jezusowi chcę śpiewać ku chwale yạ ạbn ạllh Чармъхта актъ канън يمكنني أن أزعل My mamy już zbawienie Изливай Bir shyndyq bar álemde
Song not available - connect to internet to try again?