ప్రభు యేసుని వదనములో - నా దేవుడు కనిపించె (2) పాపాత్ముల బ్రోచుటకై - కృపలొలికిన కలువరిలో (2) పరలోకముకై - చిర జీవముకై (2) ప్రార్ధించెను నా హృదయం // ప్రభు యేసుని // దిశలన్నియు తిరిగితిని - నా పాపపు దాహముతో (2) దౌష్ట్యములో మసలుచును - దౌర్జన్యము చేయుచును (2) ధన పీడనతో - మృగ వాంఛలతో (2) దిగాజారితి చావునకు // ప్రభు యేసుని // యేసు నీ రాజ్యములో - భువి కేతెంచెడి రోజు (2) ఈ పాపిని క్షమియించి - జ్ఞాపకముతో బ్రోవుమని (2) ఇల వేడితిని - విలపించుచును (2) ఈడేరెను నా వినతి // ప్రభు యేసుని // పరదైసున ఈ దినమే - నా ఆనందములోను (2) పాల్గొందువు నీవనుచు - వాగ్ధానము చేయగనే (2) పరలోకమే నా - తుది ఊపిరిగా (2) పయనించితి ప్రభు కడకు // ప్రభు యేసుని //Танръ'я садък ол mbạrk ạlrb ạ̹lhnạ ạlḥml ạlmdẖbwḥ เพื่อน Сана Съънъйорум On vous a à l'œil mn mtẖlk جارىلقاشى، جان۔دۇنيەم حاسس بفيض شكر وعرفان ạ̹n ạ̉nsy
Song not available - connect to internet to try again?