వినరే యో నరులారా-వీనుల కింపు మీర - మనల రక్షింప క్రీస్తు - మనుజావతారుఁడయ్యె - వినరే = అనుదినమున దే-వుని తనయుని పద-వనజంబులు మన-మున నిడికొనుచును నరరూపుఁ బూని ఘోర-నరకుల రారమ్మని-దురితముఁబాపు దొడ్డ - దొరయౌ మరియూ వరపుత్రుఁడు= కర మరు దగు క - ల్వరి గిరి దరి కరి-గి రయంబున ప్రభు-కరుణను గునరే ఆనందమైన మోక్ష - మందరి కియ్య దీక్షఁ - బూని తనమేని సిలువ - మ్రాను నణఁచి మృతిఁ బొందెను = దీన దయా పరుఁ - డైన మహాత్తుఁ డు-జానుగ - యాగము సలిపిన తెరంగిది పొందుఁగోరిన వారి - విందా పరమోపకారి - యెంద రెందరిఁ బరమా - నందపద మొందఁగఁజేసెను = అందమునన్ దన-బొంది సురక్తము - జిందెను భక్తుల - డెందము గుందఁగ ఇలా మాయావాదుల మాని - యితఁడే సద్గురుడని - తలపోసి చూచి మతి - ని-శ్చల భక్తిని గొలిచిన వారికి = నిల జనులకు గలు-ముల నలరెడు ధని-కుల కందని సుఖ-ములు మరి యొసఁగునుAtyń madaqtalsyn ár jerde! Rozwińmy, bracia, sztandar swój yạlạ tʿạlwạ bsrʿẗ trạk 15 Maniry mafy aho Tobě Vyznávám Сана Съънъйорум Oń jaǵyma jınaldy Viem, že môj Pán Najlepszy ze wszystkich przyjaciel
Song not available - connect to internet to try again?