సృష్టికర్తవైన యెహోవా.... నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు.... మహిమలో స్ధానమిచ్చినావు.... నాలో. . . . నిన్ను చూసావు.... నీలో. . . . నన్ను దాచావు.... నిస్వార్ధమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ !!సృష్టికర్తవైన యెహోవా!! ఏ కాంతిలేని నిశిధిలో ఏ తోడు లేని విషాదపు విధులలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్నాతండ్రివి !!2!! యేసయ్యా నను అనాధగ విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి !!2!! !!సృష్టికర్తవైన యెహోవా!! నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నను దినమెల్ల వేదించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమ మూర్తివి !!2!! యేసయ్యా నను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి !!2!! !!సృష్టికర్తవైన యెహోవా!!Не могу без Тебя Dios, Dios mío eres tú O, wzywaj Mię yạllạ tʿạlwạ ạsmʿwạ За Тобой Я иду Sempre con te qbl ạ̹ydynạ tmd ạ̹ydyk Už Spasiteľ sa narodil Lord, speak to me that I may speak/Canonbury ขอบพระคุณพระเจ้า
Song not available - connect to internet to try again?